పూరీలో ప్రధాని మోదీ సాహసం..

7 Feb, 2016 11:28 IST|Sakshi
పూరీలో ప్రధాని మోదీ సాహసం..

పూరీ: ఒడిశా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సాహసకృత్యం ఆయనకు భద్రతా బలగాలకు ముచ్చెమటలు పట్టించింది. ప్రఖ్యాత జన్నాథ ఆలయ సందర్శన కోసం ఆదివారం ఉదయం పూరీ పట్టనానికి వచ్చిన మోదీ.. హెలికాప్టర్ దిగి కారు ఎక్కి ఆలయంవైపునకు కదిలారు.

అయితే హెలిపాడ్ వద్ద తనను చూసేందుకు పెద్ద ఎత్తున గుమ్మిగిన జనాన్ని గమనించిన మోదీ.. వారిని నిరాశపర్చకూడదనే అభిప్రాయంతో కాన్వాయ్ ని ఆపేయించి, కారు డోరు తీసుకుని ఫుట్ రెస్ట్ పై నిలబడిమరీ అభివాదం చేశారు. దేశంలోనే అత్యంత పటిష్ట భద్రత కలిగిన వ్యక్తిగా నరేంద్ర మోదీ అలా కారు డోరు తెరుచుకుని నిలబడటం, అందునా అది తీవ్రవాద ప్రభావిత రాష్ట్రం కావడంతో భద్రతా సిబ్బంది అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని ఆయన చుట్టూ కంచెలా మారిపోయారు. 'సాహసం చేస్తేచేశారుగానీ ఆయన దర్శనంతో పులకించి పోయాం' అంటూ సంతోషం వ్యక్తం చేశారు హెలీప్యాడ్ కు వచ్చిన ప్రజలు.

మరిన్ని వార్తలు