‘అవినీతి’ వివరాలకు పీఎంఓ నో

22 Nov, 2018 05:43 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల సమాచారాన్ని వెల్లడించడానికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నిరాకరించింది. ఆ వివరాలు అంతర్గతమని, వాటిని బహిర్గతపర్చడం పెద్ద కసరత్తు అని బదులిచ్చింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి హరిభాయ్‌ పార్థిభాయ్‌ చౌధరిపై సీబీఐ ఉన్నతాధికారి ఒకరు అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో పీఎంఓ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులపై అప్పుడప్పుడు అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఐఎఫ్‌ఎస్‌ అధికారి సంజీవ్‌ చతుర్వేది ఆర్టీఐ కింద దాఖలుచేసిన అర్జీకి సమాధానంగా చెప్పింది.

మరిన్ని వార్తలు