ఓ ఆప్ నేతా.. ఇదేం కవితా?

24 Jan, 2014 01:31 IST|Sakshi

 సానియా మీర్జా వివాహంపై కుమార్ విశ్వాస్ కుళ్లు జోకులు
 న్యూఢిల్లీ: ‘మనిషన్నాక.. కాసింత కళా పోసన ఉండాల’ అన్న డైలాగును ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ బాగానే ఒంట బట్టించుకున్నట్టున్నారు! కానీ అదే ఇప్పుడు ఆయనకు, పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతోంది. కళా పోషణను ‘కాసింత’ కాదు.. కాస్త ‘ఎక్కువగా’ ఒంట బట్టించుకోవడమే ఇందుకు కారణం!! తన కవితాత్మక భావాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇప్పటికే పలు అంశాలపై దుమారం సృష్టించి తర్వాత లెంపలేసుకున్న ఈయన.. ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు. హైదరాబాదీ, ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహానికి సంబంధించి విశ్వాస్ గతంలో ఓ కవి సమ్మేళనంలో చేసిన ప్రసంగం వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్క ర్లు కొడుతోంది.
 
 అందులో ఆయన షోయబ్‌ను ‘మగతనం’ లేనివాడు అన్న భావన వచ్చేలా మాట్లాడారు. ‘‘సానియా పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు. తన క్రీడారంగంలో ఇక ముందుకు వెళ్లలేనని భావించి వేరే రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించాలనుకుంది. ఆమె ఓ ‘హిట్టర్’ను పెళ్లాడాలనుకుంటే ఎవరైనా భారతీయుడిని చేసుకోవాల్సింది. కానీ పాకిస్థాన్ ఎందుకు వెళ్లింది?’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆ కార్యక్రమంలో ఉన్నవారంతా గొల్లున నవ్వారు.
 
 

మరిన్ని వార్తలు