అయోధ్యలో ఆంక్షలు

5 Nov, 2019 03:54 IST|Sakshi

సుప్రీంతీర్పు రానున్న నేపథ్యంలో చర్యలు

అయోధ్య/న్యూఢిల్లీ: రామమందిరం–బాబ్రీ మసీదుపై నవంబర్‌ 17లోగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అయోధ్యలో పలు ఆంక్షలు విధించింది. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరగకుండా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈవిషయంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ చర్చలు జరపకుండా ఆంక్షలు విధించనున్నారు. డిసెంబర్‌ 28 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ కాలంలో అన్ని ఫోన్‌ కాల్స్‌ రికార్డు చేస్తామని తెలిపింది.

ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాలలో అసత్యాల ప్రచారం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్‌ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, తీర్పు వెలువడిన రోజు దేవతా విగ్రహాల ప్రతిష్టాపన, విజయోత్సవ ఊరేగింపులు జరపకుండా నిషేధం విధించారు. రాళ్లు సేకరించడం, కిరోసిన్, యాసిడ్‌ అమ్మకాలు కూడా నిలిపివేశారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ అధికారుల, పోలీసుల సెలవులను యూపీ ప్రభుత్వం రద్దుచేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు