మహిళా మావోయిస్టు మంగ్లీ అరెస్ట్‌

1 May, 2019 11:24 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : కరుడు గట్టిన మహిళా మావోయిస్టు కోసి అలియాస్‌ మంగ్లీని అరెస్ట్‌ చేశామని దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ వెల్లడించారు. మల్కన్‌గిరి మావోయిస్టు సభ్యురాలైన మంగ్లీపై రూ. 5లక్షల రివార్డు ఉంది. 2011 నుంచి మవోయిస్టుల్లో పనిచేస్తున్న మంగ్లీ.. భద్రతా దళాలు, గ్రామస్థులపై దాడి చేసిన కేసుల్లో నిందితురాలిగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు.

2011 నుంచి మంగ్లీపై 10 కేసులు ఉన్నాయని చెప్పారు.  2016లో సీఆర్ పీఎఫ్ బలగాలను చంపిన కేసు, చోలనర్ లో మందుపాతర పేల్చి ఐదుగురు పోలీసులను చంపిన కేసులో మంగ్లీ నిందితురాలని ఎస్పీ పేర్కొన్నారు. దంతెవాడ స్థానిక పోలీసులు, జిల్లా రిజర్వు గార్డులు కలిసి గాలింపు జరిపి మహిళా మావోయిస్టు మంగ్లీని అరెస్టు చేశారని ఎస్పీ వివరించారు.

మరిన్ని వార్తలు