భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త

25 Jul, 2014 13:26 IST|Sakshi

చంఢీగడ్: భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తనుకు తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ పోలీసు కానిస్టేబుల్. ఆ ఘటనలో భార్య మృతి చెందగా, కానిస్టేబుల్ మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ సంఘటన చంఢీగడ్లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అనంతకుమార్ పోలీసు కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడని... అతడి భార్య డింపుల్ ఆసుపత్రిలో ఉద్యోగిగా పని చేస్తుందని తెలిపారు.

అయితే ఇద్దరు మధ్య గత కొద్ది కాలంగా మనస్పర్థలు ఉన్నాయని... ఈ నేపథ్యంలో ఆ ఘటన చేసుకుని ఉంటుందని చెప్పారు. కానిస్టేబుల్ అనంతకుమార్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు