పోలీసులకు ఆ అధికారం లేదు: సుప్రీంకోర్టు

24 Sep, 2019 14:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విచారణ సమయంలో నిందితుల స్థిరాస్తులను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 102 ప్రకారం విచారణ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఇది  చెల్లుబాటు కాదని ఇటీవల ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సీఆర్‌పీసీ 102పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, సంజయ్‌ ఖన్నాల ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం మంగళవారం తీర్పును వెలువరిస్తూ.. విచారణ సమయంలో నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదని సుప్రీం స్పష్టం చేసింది. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది.

మరిన్ని వార్తలు