ఎన్‌కౌంటర్ల దర్యాపుపై సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే..

19 Jul, 2019 07:53 IST|Sakshi

పోలీస్‌ అధికారుల సంఘం పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు 

సాక్షి, న్యూఢిల్లీ :  పోలీస్‌ ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు జరిపేటప్పుడు గతంలో జస్టిస్‌ ఆర్‌.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని మార్గదర్శకాలను పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2006లో నాటి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌ అలియాస్‌ బుర్రా చిన్నయ్యసహా 8 మంది నక్సలైట్లు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. కె.రాధ అనే వ్యక్తి ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ఘటనపై ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ(ఏపీసీఎల్సీ) హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అది ఎన్‌కౌంటర్‌ కాదని, అక్రమంగా నిర్బంధించి తెచ్చి అడవుల్లో చంపేశారని పిటిషన్‌లో పేర్కొంది. జస్టిస్‌ గోడ రఘురాం, జస్టిస్‌ వీవీఎస్‌ రావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ జి.భవానీప్రసాద్‌లతో కూడిన ఫుల్‌ బెంచ్‌ విచారణ జరిపి ఫిబ్రవరి 6, 2009న తీర్పు ప్రకటించింది. ‘ఒక పోలీస్‌ అధికారి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే, అధికార విధుల్లో భాగమైనా, ఆత్మరక్షణ కోసమైనా, ఘటనకు దారితీసిన కారణాలను నిక్షిప్తం చేస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి’అని ఆ తీర్పులో పేర్కొంది.

మరిన్ని వార్తలు