కబ్జా భూమిని వాద్రా కంపెనీకి అమ్మారు!

26 Jan, 2016 11:31 IST|Sakshi
కబ్జా భూమిని వాద్రా కంపెనీకి అమ్మారు!

బికనీర్‌: ప్రభుత్వ భూమి కొనుగోలు వ్యవహారంలో రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీకి రాజస్థాన్ పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారు. కుట్రపూరితంగా మోసం చేసి కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని ఆయన కంపెనీకి అమ్మారని పోలీసులు తేల్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడైన రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి ప్రమోట్ చేస్తున్న 'స్కై లైట్ హస్పిటాలిటీ'పై వసుంధరారాజే నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం 2014లో కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ కొనుగోలు చేసిన 69.55 హెక్టార్లు ప్రభుత్వ భూమిని అభియోగాలు మోపారు.

అయితే ఈ భూమి విషయంలో బొనాఫైడ్ కొనుగోలు దారుగా ఉన్న వాద్రాను మోసపోయారని, ఆయన మోసానికి బాధితుడయ్యారని డీఎస్పీ రామావతర్ సోని విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆయన కంపెనీకి అమ్మినట్టు విచారణలో తేలిందని ఆయన వివరించారు. భూముల కొనుగోలు విషయంలో రాబర్ట్ వాద్రా కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్టు రాజస్థాన్, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు