ఆ కారు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌‌‌ ఉగ్రవాదిదే

29 May, 2020 14:39 IST|Sakshi
హిదాయ‌తుల్లా మాలిక్, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాది

పుల్వామా : జ‌మ్మూక‌శ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పేలుడు ప‌దార్థాల‌తో ఉన్న సాంట్రో కారును గురువారం స్థానిక బ‌ల‌గాలు గుర్తించిన విష‌యం తెలిసిందే. గురువారం జ‌రిగిన ఈ ఘ‌ట‌నపై పోలీసులు తాజాగా స‌మాచారాన్ని అందించారు. సుమారు 20 కిలోల పేలుడు ప‌దార్థాలు క‌లిగి ఉన్న సాంట్రో కారు ఓన‌ర్‌ను గుర్తించిన‌ట్లు పోలీసులు చెప్పారు. ఆ కారు హిదాయ‌తుల్లా మాలిక్ అనే వ్య‌క్తిది అని తేల్చారు. కాగా సోఫియాన్ జిల్లాకు చెందిన హిదాయతుల్లా గ‌త ఏడాది హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్‌ గ్రూఫ్‌లో చేరాడు. కాగా గురువార‌మే కారులో ఉన్న ఐఈడీని(ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌) బాంబ్‌ స్వ్వాడ్‌ టీమ్‌తో ఆపరేషన్‌ నిర్వహించి పేల్చివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా రెండు వారాల కింద పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ బలగాలతో పాటు జమ్మూ కశ్మీర్‌ పోలీసులపై హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా భద్రతా బలగాలు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.కాగా, గత సంవత్సరం పుల్వామాలో జరిగిన ఐఈడీ వాహన దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. (జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా