పోలీసును చితకబాదిన నక్సల్స్

17 Mar, 2015 07:43 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఛత్తీస్గఢ్లో ఓ ఏఎస్ఐని మావోయిస్టులు చితకబాదిన ఘటన సోమవారం జరిగింది. సుక్మా జిల్లా పోలంపల్లి స్టేషన్ ఏఎస్ఐ దేవాంగి, మరో కానిస్టేబుల్తో కలిసి సోమవారం మధ్యాహ్నం బైక్పై గోరుగూడ వైపు వెళ్తుండగా..  వారిని మావోయిస్టులు అటకాయించారు. నక్సల్స్ను చూడగానే వాహనం వెనుక కూర్చున్న కానిస్టేబుల్ పారిపోగా, ఏఎస్ఐ మాత్రం దొరికిపోయాడు. అతణ్ణి మావోయిస్టులు కర్రలతో విపరీతంగా కొట్టారు.  దెబ్బలకు తాళలేక కిందపడిపోయిన దేవాంగిని అక్కడే విడిచిపెట్టి మావోయిస్టులు వెళ్లిపోయారు.

 

తర్వాత ఆ మార్గంలో ప్రయాణించిన కొందరు వ్యక్తులు పోలంపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకొని బాధితుణ్ణి దోర్నపాల్ ఆసుపత్రికి తరలించారు. ఏఎస్ఐ దేవాంగికి ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారని పోలీసులు చెప్పారు. కాగా మావోయిస్టులు చేతికి చిక్కిన పోలీసును చంపేయకుండా కొట్టి వదిలేయడం ఇదే ప్రథమం. ఏఎస్ఐని కొట్టి విడిచిపెట్టడం ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు