క‌రోనా: పాడె క‌ట్టి మోసుకెళుతున్న పోలీసులు!

5 May, 2020 14:53 IST|Sakshi

సాక్షి, చెన్నై :  కాఫిన్ డ్యాన్స్‌... పేరు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోయినా ఈ డ్యాన్స్ మాత్రం దాదాపుగా అంద‌రికీ తెలుసు. అంత‌లా పాపుల‌రైంది. ఇందులో మ‌నిషి అంత్య‌క్రియ‌లు జ‌రుగుతుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ వ‌స్తుంటుంది. ఇంత‌లో యూనిఫాం వేసుకున్న న‌లుగురు వ్య‌క్తులు శ‌వ‌పేటిక‌ను మోస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. ఇది ఘ‌నా దేశంలో ఓ సంప్ర‌దాయం. చావును కూడా వేడుక‌గా చేసుకుంటారు. అయితే శిక్ష‌ణ పొందిన బ్యాండ్‌ల‌కు మాత్ర‌మే పాడె మోసే అవ‌కాశం ఉంటుంది. వీరిని "ప‌ల్బెరియాస్" అంటారు. ఇంత‌కీ ఇదంతా ఎందుకంటే సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్న ఈ వీడియోను త‌మిళ‌నాడు పోలీసులు క‌రోనా అవ‌గాహ‌న కోసం వాడారు. (పోలీసుల సజీవ దహనానికి యత్నం )

మ‌రింత వివ‌రంగా చెప్పాలంటే.. క‌ద్ద‌లూర్‌కు చెందిన పోలీసులు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ఎలా ఉంటుందో సినిమా చూపించారు. ఈ మేర‌కు ఓ వీడియో షేర్ చేశారు. అందులో బైక్‌పై వ‌చ్చిన ఓ వ్య‌క్తి పోలీసులు ప‌హారా కాస్తుండ‌టం చూస్తాడు. ఇప్పుడు కానీ ముందుకు వెళితేనా... అని ఒక్క‌సారి ఊహించుకుంటాడు. అందులో పోలీసులు అత‌నిన పాడె మోస్తూ డ్యాన్స్ చేస్తారు. దీంతో ఒక్క‌సారిగా భ్ర‌మ‌లోంచి తేరుకున్న‌ యువ‌కుడు 'ఎందుకొచ్చిన గొడ‌వ‌రా బాబూ' అని యూట‌ర్న్ తీసుకుని ఇంటికి ఉడాయిస్తాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు పోలీసుల ఐడియా అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు. (ప్రాణాల‌కు తెగించి కాపాడిన కుక్క‌)

మరిన్ని వార్తలు