కశ్మీర్‌ ప్రజలపై ఉగ్ర కుట్ర

10 Sep, 2019 19:33 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌ ప్రజల రోజువారీ దినచర్యను అడ్డుకుని సాధారణ పరిస్థితికి భగ్నం కల్పించేందుకు పాక్‌ ఉగ్రసంస్ధలు లష్కరే, జైషే సహా పలు ఉగ్ర మూకలు ప్రయత్నిస్తున్నాయని జమ్ము కశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ పేర్కొన్నారు. రోజువారీ విధులను విరమించాలంటూ ప్రజలపై ఈ ఉగ్రసంస్ధలు ఒత్తిడి చేస్తున్నా ప్రజలు వాటిని ఖాతరు చేయడం లేదని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో అన్ని పెట్రోల్‌ పంపులు తెరిచిఉంటున్నాయని, భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతను అందిస్తున్నాయని చెప్పారు. సొపోర్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రసంస్ధ తరపున పనిచేస్తున్న ఓ గ్రూప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సింగ్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారని చెప్పారు. పలు ప్రాంతాల్లో ప్రజలను బెదిరిస్తూ పోస్టర్లు అంటిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సొపోర్‌లో ముగ్గురు స్ధానిక ఉగ్రవాదుల తరపున వీరు పనిచేస్తున్నట్టు గుర్తించామని అన్నారు.

>
మరిన్ని వార్తలు