రేపు తేలనున్న ఐదుగురు సీఎంల భవితవ్యం

18 May, 2016 19:08 IST|Sakshi

న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం సహా కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రుల భవితవ్యం గురువారం తేలనుంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కౌంటింగ్కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటలకల్లా ఫలితాల ట్రెండ్స్ తెలిసే అవకాశముంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెలువడుతాయని అధికారులు చెప్పారు.

ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్లో మాత్రమే అధికార పార్టీ మళ్లీ గెలవనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వేలు తెలిపాయి. ఇక మిగిలిన తమిళనాడు (జయలలిత-అన్నా డీఎంకే), కేరళ (ఉమెన్ చాందీ-కాంగ్రెస్), పుదుచ్చేరి (రంగస్వామి), అసోం (తరుణ్‌ గొగోయ్- కాంగ్రెస్)లో అధికార పార్టీలకు పరాజయం తప్పదని జాతీయ సర్వేలు తేల్చాయి. అయితే తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తారని స్థానిక మీడియా ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. దీంతో తమిళనాడు ఫలితాలపై ఎక్కువ ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు