మహాశిఖరానికి నివాళులు అర్పించేందుకు..

17 Aug, 2018 10:00 IST|Sakshi

ఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. కృష్ణ మీనన్‌ మార్గ్‌లోని నివాసంలో వాజ్‌పేయిని కడసారి చూసేందుకు జనం పోటెత్తారు. ఈ క‍్రమంలోనే వాజ్‌పేయి స్మృతులను గుర్తు చేసుకున్నారు.

వాజ్‌పేయి పార్ధివ దేహానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్‌ నరసింహన్‌లు లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వాజ్‌పేయి మృతి దేశానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆయన అందరితో బాగుంటూ, గొప్ప మానవతావాదిగా ఉండేవారన్నారు. కేరళ, తమిళనాడు గవర్నర్లు సదాశివం, భన్వరీలాల్‌ పురోహిత్‌లతో పాటు వైఎస్సార్‌సీపీ నేతల విజయసాయి రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, వరప్రసాద్‌లు వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. బాలీవుడ్‌ ప్రముఖులు జావేద్‌ అక్తర్‌, షబానా అజ్మీలు వాజ్‌పేయికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు