పూనమ్.. ఇదేం చోద్యం?

3 Jun, 2016 09:59 IST|Sakshi
పూనమ్.. ఇదేం చోద్యం?

జాబల్పూరు: మహారాష్ట్ర బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం బినా-భోపాల్ ప్రత్యేక రైలులో ఆమె ప్రయాణించడంపై వివాదం రేగింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

మే 31న జరిగిన మహారాష్ట్ర సాగర్ జిల్లాలోని బినాలో జరిగిన కార్యక్రమానికి రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా హాజరయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం ఆయన కోసం భోపాల్ నుంచి పశ్చిమమధ్య రైల్వే ప్రత్యేక రైలు పంపింది. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన ఇదే రైలులో భోపాల్ వెళ్లాల్సివుంది. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీలో వెళ్లాలనుకున్నారు. అయితే కార్యక్రమం ఆలస్యంగా పూర్తికావడంతో ఆయన బినా నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో వెళ్లిపోయారు. అయితే బీజేపీ పూనమ్ మహాజన్ ప్రత్యేక రైలులో బినా నుంచి భోపాల్ కు వెళ్లారు.

దీనిపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీసింది. రైల్వే మంత్రి కోసం పంపిన ప్రత్యేక రైలులో ప్రయాణించి ఆమె ప్రొటోకాల్ ఉల్లఘించారని ఆరోపించింది. ఆమె ప్రొటోకాల్ ఉల్లఘించారని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. అయితే పూనమ్ ప్రత్యేక రైలులో ప్రయాణించడం యాధృచ్చికంగా జరిగిందని, ఆమెను వీఐపీగా చూడలేదని  పశ్చిమమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రమేశ్ చంద్రా తెలిపారు. ఎంపీలకు ప్రత్యేక రైళ్లు నడపరాదని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు