మహా క్యాబినెట్‌ : శివసేనకు హోం శాఖ

12 Dec, 2019 17:57 IST|Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి సర్కార్‌ మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తును కొలిక్కితెచ్చింది. కీలక హోంశాఖ శివసేనకు చెందిన ఏక్‌నాథ్‌ షిండేకు దక్కనుంది. ఎన్సీపీ నేత ఛగన్‌ భుజబల్‌కు గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారు. బాలాసాహెబ్‌ థొరట్‌ (కాంగ్రెస్‌)కు రెవెన్యూ శాఖ, జయంతి పాటిల్‌ (ఎన్సీపీ) ఆర్థిక శాఖ, సుభాష్‌ దేశాయ్‌ (శివసేన) పరిశ్రమలు, నితిన్‌  రౌత్‌కు (కాంగ్రెస్‌) ప్రజా పనుల శాఖను కేటాయించనున్నారు. మూడు పార్టీలకు సమ ప్రాధాన్యం దక్కేలా శాఖల కూర్పును చేపట్టారు. శివసేనకు హో మంత్రిత్వ శాఖ, ఎన్సీపీకి ఆర్థిక శాఖ, కాంగ్రెస్‌కు రెవెన్యూ శాఖ కేటాయించడం ద్వారా మూడు పార్టీలక ప్రాధాన్యం కలిగిన శాఖలను కేటాయించారు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాల తర్వాత శాఖల కేటాయింపుపై కసరత్తు ప్రక్రియ కొలిక్కివచ్చింది.

మరిన్ని వార్తలు