ఇక దేశమంతా ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు

25 Dec, 2018 04:19 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019, ఏప్రిల్‌ 1 నుంచి మూడేళ్లలోపు దేశమంతటా స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లను అమర్చాలని యోచిస్తోంది. ప్రీపెయిడ్‌ మీటర్లతో పేదలకు లబ్ధి కలుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం వినియోగదారులు వాడకంతో సంబంధం లేకుండా ప్రతీ నెలా బిల్లును చెల్లించాల్సి వస్తోందన్నారు. కొత్త విధానంలో విద్యుత్‌ మీటర్లను మొబైల్‌ ఫోన్ల తరహాలో రీచార్జ్‌ చేయొచ్చు. దీంతో విద్యుత్‌ ఆదా అవుతుందనీ, సామాన్యులకు అదనపు భారం తప్పుతుందని చెప్పారు. విద్యుత్‌ సరఫరా నష్టాలు, బిల్లుల ఎగవేతలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అలాగే స్మార్ట్‌ మీటర్ల కారణంగా నైపుణ్యమున్న యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు