యథావిథిగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

12 Jul, 2020 13:00 IST|Sakshi

ప్రహ్లాద్‌ జోషీ వెల్లడి

హుబ్లీ : కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తామని కేంద్ర పార‍్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు. ‘వర్షాకాల సమావేశాలు తప్పనిసరిగా జరుగుతాయి..నిబంధనలకు అనుగుణంగా అన్ని ముందస్తు జాగ్రత్తల’ను చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌ 12 బిల్లులను ఆమోదించింది. ఆ సెషన్స్‌లో రెండు సభల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టారు.

ఫైనాన్స్‌ బిల్లుతో పాటు బడ్జెట్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం ఇరు సభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనతో సమావేశాలకు అర్థంతరంగా తెరపడింది. ఇక భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇక గడిచిన 24 గంటల్లో భారత్‌లో తాజాగా 28,637 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,49,553కు ఎగడబాకింది. కాగా కరోనాతో ఒక్కరోజులో 551 మరణించడంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 22,674కు పెరిగింది. చదవండి : ఆ ప్రాజెక్టును అడ్డుకోలేం

మరిన్ని వార్తలు