భారతరత్న అందుకున్న ప్రణబ్‌

8 Aug, 2019 18:58 IST|Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో గురువారం భారతరత్న పురస్కారాల ప్రదానోత్స కార్యక్రమం జరిగింది. 2019కి గాను దేశ అత్యున్నత పురస్కారాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు నానాజీ దేశ్‌ముఖ్‌, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్‌ హజారికాలకు ప్రకటించిన విషయం తెలిసిందే. నానాజీ, భూపేన్‌ హజారికాలకు కేంద్రం మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేడు ఈ అవార్డులను ప్రదానం చేశారు.

ఈ రోజు జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. భూపేన్‌ హజారికా తరఫున ఆయన కుమారుడు తేజ్‌ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌ తరఫున ఆయన కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్రమంత్రులు, పలు పార్టీలకు చెందిన నేతలు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు