9 కోట్లు ఇచ్చారు.. ఆ మనిషి ఏడి?

31 Aug, 2016 11:26 IST|Sakshi
9 కోట్లు ఇచ్చారు.. ఆ మనిషి ఏడి?

ముఖ్యమంత్రి సలహాదారు పదవిలో నియమించి.. రూ. 9 కోట్లు చెల్లిస్తే, ఇప్పుడు ఆ మనిషి ఏమైపోయాడని బిహార్ బీజేపీ నేతలు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను ప్రశ్నిస్తున్నారు. బిహార్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత కిషోర్‌ (39)ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో తమ ఎన్నికల వ్యూహకర్తగా నియమించిన విషయం తెలిసిందే. 1989లో యూపీలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్.. ఈ 27 ఏళ్ల నుంచి అధికారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూనే ఉంది.

బిహార్ రాష్ట్రానికి 2025 విజన్ డాక్యుమెంటు తయారుచేయడం కోసం ప్రశాంత కిషోర్‌కు నితీష్ సర్కారు రూ. 9.31 కోట్లు చెల్లించిందని బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ అన్నారు. కానీ ఆయన ఈ పని వదిలిపెట్టి.. యూపీలో కాంగ్రెస్ పని చూస్తున్నందున వెంటనే ముఖ్యమంత్రి సలహాదారు పదవి నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. సీఎం సలహాదారు హోదాలో బిహార్ వికాస్ మిషన్ సభ్యుడిగా కూడా ఉన్న కిశోర్.. మే 31న జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. జనవరిలో సీఎం సలహాదారుగా నియమితుడైన తర్వాత బిహార్‌కు మహా అయితే ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చారు.

మరిన్ని వార్తలు