ఆస్పత్రిలో ప్రత్యూష ఫ్రెండ్

4 Apr, 2016 02:18 IST|Sakshi
ఆస్పత్రిలో ప్రత్యూష ఫ్రెండ్

ప్రత్యూష గర్భవతి అని అనుమానాలు
 
 ముంబై: బుల్లితెర నటి, ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ ఆదివారం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది నీరజ్ గుప్తా తెలిపారు. అతను ఛాతీలో నొప్పి, లో బీపీ, కుంగుబాటు కారణంగా స్థానిక ఆస్పత్రిలో చేరారని, చాలా బలహీనంగా ఉన్న ఆయనను  ఐసీయూలో ఉంచారని చెప్పారు. కాగా, ప్రత్యూష ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. అయితే రాహుల్  కారణంగానే ఆమె ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది.

 ప్రత్యూష గర్భవతా..?: చనిపోయే సమయానికి ప్రత్యూష రెండు నెలల గర్భవతి అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే  ఈ విషయం వైద్యులు ఇచ్చిన రిపోర్టులో పేర్కొనలేదని  విచారణాధికారి తెలిపారు. ఆమె పోస్ట్‌మార్టమ్ రిపోర్టు నెల రోజుల్లో రానుందని, అది వస్తే అందులో ఆమె గర్భవతా కాదా అనేది తేలుతుందన్నారు. ప్రత్యూష, రాహుల్ జంటకు స్నేహితులైన పలువురు చెబుతున్న దాని ప్రకారం బెంగాలీ నూతన సంవత్సరాది రోజైన ఈ నెల 14న వారు పెళ్లి చేసుకోడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, ఆమె తల్లిదండ్రుల కోసం రూ. 50 లక్షల అప్పు తీసుకుందని రాహుల్ తండ్రి హర్షవర్ధన్ చెప్పారు. దీంతో ఆమె ఒత్తిడికి గురయ్యేదన్నారు. ఆమెకు అప్పుడప్పుడు రూ. పది వేల చొప్పున డబ్బులు పంపేవాడినని అన్నారు.

మరిన్ని వార్తలు