ఊపిరాడకే ప్రత్యూష మృతి

3 Apr, 2016 01:15 IST|Sakshi
ఊపిరాడకే ప్రత్యూష మృతి

ముంబై: శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ‘బాలికా వధు’ ఫేం నటి ప్రత్యూష బెనర్జీ ఊపిరాడకే చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో స్పష్టమైంది. గొంతుబిగుసుకుపోయిన ఆనవాళ్లున్నాయని తేలింది. కాగా, ప్రత్యూష అంత్యక్రియలు శనివారం ముంబైలో నిర్వహించారు. బుల్లితెర నటులు పలువురు హాజరై కన్నీటితో తుది వీడ్కోలు పలికారు.

కాగా, ఈ కేసుకు సంబంధించి ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌ను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. రాహుల్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ప్రత్యూష సెల్ నుంచి వెళ్లిన చివరి కాల్స్, వీరి మధ్య జరిగిన సందేశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. అయితే.. ప్రత్యూష తన వివాహానికి దుస్తుల్ని డిజైన్ చేయమని కాస్ట్యూమ్ డిజైనర్ అయిన  స్నేహితుడు రోహిత్‌ను అడిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు