కుంభమేళా క్యాంప్‌ వద్ద అగ్ని ప్రమాదం

14 Jan, 2019 13:50 IST|Sakshi

లక్నో : మరో 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా ఉత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అయితే కుంభమేళా ప్రారంభం కంటే ముందే  ఓ అపశృతి చోటు చేసుకుంది. ప్రయాగ్‌ రాజ్‌ కుంభ మేళ క్యాంప్‌ వద్ద సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. వివరాలు.. దిగంబర్‌ అకాడ శిబిరంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే అగ్ని ప్రమాదంతో అక్కడి తాత్కాలిక నిర్మాణాలు కొన్ని కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రేపటి నుంచి కుంభమేళా ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు