ఆ ఆప్‌ ఎమ్మెల్యేలు అనర్హులే

22 Jan, 2018 03:10 IST|Sakshi
ఆప్‌ సమావేశంలో ఎమ్మెల్యే ఆల్కా లాంబా

20 మంది ఎమ్మెల్యేలపై ఈసీ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ: లాభదాయక పదవుల్లో కొనసాగినందుకు ఢిల్లీ అసెంబ్లీలోని 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న ఎన్నికల సంఘం సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఆదివారం కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్‌లో రాష్ట్రపతి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో కొనసాగారంటూ ఎన్నికల సంఘం చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటూ.. 20 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తున్నాను’ అని అందులో పేర్కొన్నారు.

రాష్ట్రపతి నిర్ణయంపై ఆప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం రాజ్యాంగవిరుద్ధమని ఆప్‌ నేత అశుతోష్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి నిర్ణయం బాధ కలిగించిందని.. తుది నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రపతి తమను సంప్రదించి ఉండాల్సిందని వేటుపడిన ఎమ్మెల్యే అల్కాలాంబా తెలిపారు. అందుకే దేవుడు 67 సీట్లిచ్చాడు ‘మూడేళ్ల తర్వాత 20 మంది అనర్హులవుతారని దేవుడికి ముందే తెలుసు అందుకే 67 సీట్ల భారీ మెజారిటీ కట్టబెట్టాడు’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. కేంద్రం కుట్ర పన్నిందని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు.

మరిన్ని వార్తలు