మరణశిక్ష పడిన ఖైదీకి రాష్ట్రపతి క్షమాభిక్ష

27 Mar, 2015 12:21 IST|Sakshi
మరణశిక్ష పడిన ఖైదీకి రాష్ట్రపతి క్షమాభిక్ష

న్యూఢిల్లీ:  భార్యా,పిల్లలను హత్య చేసిన కేసులో మరణశిక్ష పడిన ఖైదీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష ప్రసాదించారు.  క్షమాభిక్ష ప్రసాదించమంటూ మన్ మహదూర్ అనే ఖైదీ పెట్టుకున్న అర్జీపై  రాష్ట్రపతి మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తూ గురువారం సంతకం చేశారు. అసోంలోని దిబ్రూగర్ ప్రాంతానికి చెందిన మన్ బహదూర్ దివాన్, భార్య గౌరి, కుమారులు  రాజీబ్, కాజీబ్లను  2002 సెప్టెంబర్లో కిరాతకంగా  హత్య చేశాడు.   అంతేకాకుండా మన్ మహదూర్.. గతంలో కూడా పొరుగింటి వ్యక్తిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన నేర చరిత్ర ఉంది.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతిపాదన మేరకు  రాష్ట్రపతి  ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  వివిధ కేసుల్లో కోర్టులు మరణశిక్ష విధించిన దోషులు, తమకు క్షమాభిక్ష ప్రసాదించమంటూ  విన్నవించుకోవడం, వాటిని పరిశీలించిన మీదట రాష్ట్రపతి నిర్ణయం ప్రకటించడం  ఆనవాయితీ.  అయితే నిఠారీ వరుస హత్యల కేసులో మరణశిక్ష పడిన  సురేందర్ కోలీ,   22 మందిని హత్యచేసిన  యాకూబ్ మీనన్ పిటిషన్లను  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల తిరస్కరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు