ఆ 27 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు అర్హులే

26 Oct, 2018 03:34 IST|Sakshi

న్యూఢిల్లీ: లాభదాయక పదవుల వివాదం నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎమ్మెల్యేలు అర్హులేనని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం ఢిల్లీలోని అధికార ఆప్‌కి ఊరట లభించినట్లయింది. లాభదాయక పదవుల్లో ఉన్న కారణంగా ఆప్‌కి చెందిన 27 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ అందిన దరఖాస్తును రాష్ట్రపతి కోవింద్‌ తిరస్కరించారు. 27 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను ఢిల్లీలోని సర్కారు దవాఖానల్లో ‘రోగి కల్యాణ్‌ సమితి’ చైర్మన్లుగా నియమిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం..ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటయ్యే ‘రోగి కల్యాణ్‌ సమితి’కి ఆప్రాంత ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉంటారు. ప్రతి సమితికి ఏడాదికి రూ.3 లక్షల వరకు గ్రాంట్‌ను ప్రభుత్వం ఇస్తుంది.

>
మరిన్ని వార్తలు