దేశం గర్వించదగ్గది మన సైన్యం: రాష్ట్రపతి, ప్రధాని

15 Jan, 2018 16:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్మీ డే సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధనమంత్రి నరేంద్ర మోదిలు సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. పురుష, మహిళా సైన్యానికి, వారి కుటుంబీకులకు, వృద్ధులకు కూడా గ్రీటింగ్స్‌ తెలిపారు. మీరు దేశం గర్వించదగ్గ వారని, పౌరుల భద్రత పట్ల ఎంతో జాగరూకత వహిస్తారని రాష్ట్రపతి తన ట్విటర్‌లో కొనియాడారు. దేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు సైనికులు కృషిచేస్తున్నారంటూ ప్రధాని మోదీ తన ట్విటర్‌లో కొనియాడారు. ఆర్మీ డే సందర్భంగా వారికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పౌరులు కూడా ఎలాంటి అభిజాత్యం లేకుండా సైన్యం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారన్నారు. మన సైన్యం దేశాన్ని రక్షించడంలోనేగాక ప్రకృతి విలయాలు, ప్రమాదాలు సంభవించినపుడు ముందుండి మానవతా దృక్పథంలో సహాయక చర్యలు చేపడుతుంటుందని అన్నారు. 1949లో భారత్‌లో చివరి బ్రిటిష్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ సర్‌ ఫ్రాన్సిస్‌ బచర్‌ నుంచి మొదటి ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఫీల్డ్‌ మార్షల్‌ కె.ఎం.కరియప్ప బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ గుర్తుగా ఏటా ఆర్మీడేను నిర్వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు