మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి

30 Jan, 2018 15:16 IST|Sakshi
మహాత్ముడికి నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాజ్‌ఘాట్‌లో భారత జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. నేడు మహాత్మా గాంధీ 70వ వర్థంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, నావీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబా, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధానోవా  తదితరులు మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అక్కడ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.అలాగే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీలు కూడా జాతిపితకు నివాళులర్పించారు.

మహ్మాతుడి అసలు పేరు మోహన్‌ దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ. మహాత్మా గాంధీ 1948, జనవరి 30న నాథూరాం గాడ్సే అనే వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యారు. జనవరి 30న భారత జాతిపిత మహాత్మా గాంధీతో పాటు, స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమర వీరులను గుర్తుచేసుకుంటామని రాష్ట్రపతి కోవింద్‌ అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాటి నాయకుల ధైర్యసాహసం, భారత జాతి కోసం వారికున్న అంకితభావాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటామని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు