క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి

2 Mar, 2020 16:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న నిర్భయ అత్యాచార, హత్య దోషుల ఉరిశిక్షలో కీలక పరిణామం చోటుచేసకుంది. దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్తా రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పటిషన్‌ను రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. శిక్ష అమలుకు సమయం దగ్గరపడుతుండటంతో.. సోమవారం ఉదయమే ఆయన క్షమాభిక్ష పెట్టుకున్నారు. దీనిని పరిశీలించిన రాష్ట్రపతి క్షమాభిక్షకు దోషులు అనర్హులని తిరస్కరించారు. కాగా ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ పవన్‌గుప్తా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం ఇదివరకే కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే  డెత్‌వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు కూడా నిరాకరించింది. దీంతో నలుగురు దోషులను రేపు (మంగళవారం) ఉదయం ఆరుగంటలకు తీహార్‌ జైల్లో ఉరితీసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు