పెట్రోల్ ధర పెంపు.. డీజిల్ ధర తగ్గింపు

30 Sep, 2016 21:26 IST|Sakshi
పెట్రోల్ ధర పెంపు.. డీజిల్ ధర తగ్గింపు

న్యూఢిల్లీ : ఇంధన ధరలలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. పెట్రోలు ధరలు స్వల్పంగా పెరగగా, డీజిల్ ధర కాస్త తగ్గింది. పెట్రోల్ లీటర్ పై 28 పైసలు పెంచగా, డీజిల్ పై లీటర్ కు 6 పైసలు తగ్గించారు. కొత్త ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నెలలో ఇంధన ధరలలో మార్పులు చేయడం ఇది నాలుగోసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు, డాలర్-రూపాయి మారకం విలువను బట్టి ఆ మేరకు ధరల్లో స్వల్ప మార్పు చేశారు.

మరిన్ని వార్తలు