మళ్లీ మంత్రివర్గ విస్తరణ?

16 Mar, 2017 07:06 IST|Sakshi
మళ్లీ మంత్రివర్గ విస్తరణ?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు మంత్రివర్గ పునఃవ్యవస్ధీకరణ చేయనున్నారా?. ఢిల్లీలో తాజా పరిణామాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టడంతో కొత్త ముఖాలను కేబినేట్‌లోకి తీసుకునేందుకు మోదీ ఈ యోచన చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత(ఏప్రిల్‌ 12) మంత్రి వర్గాన్ని పునఃవ్యవస్ధీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
అంతేకాకుండా కీలక పదవులు ఖాళీగా ఉండటం కూడా మంత్రి వర్గ పునఃవ్యవస్ధీకరణ అవసరాన్ని సూచిస్తున్నాయి. పారికర్‌ నుంచి రక్షణ మంత్రిగా కూడా అదనపు బాధ్యతలు అరుణ్‌ జైట్లీకి వెళ్లాయి. పునఃవ్యవస్ధీకరణలో కొత్త రక్షణ మంత్రిని మోదీ ఎంపిక చేయొచ్చు. ఈ మధ్యే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్న సుష్మా స్వరాజ్‌ స్ధానంలో కొత్త వ్యక్తిని తీసుకునే చాన్స్‌ ఉందని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం.
 
ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పురోగతి చూపించిన మంత్రులకు ప్రమోషన్లు కూడా కేబినేట్‌ పునఃవ్యవస్ధీకరణలో ఇస్తారని తెలిసింది. గతేడాది జూన్‌లో మోదీ కేబినేట్‌ను పనఃవ్యవస్ధీకరించిన విషయం తెలిసిందే.
మరిన్ని వార్తలు