కొత్త నాణేల ముద్రణ అవాస్తవం

12 Nov, 2017 02:56 IST|Sakshi

ముంబై: ‘కొత్తగా ముద్రించిన రూ.10, రూ.50, రూ.100 కాయిన్లు ఇవే’అంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వార్తలను భారత ప్రభుత్వ మింట్‌(ఐజీఎమ్‌) కొట్టిపారేసింది. ఇదంతా అవాస్తవమని, అసలు అలాంటి నాణేలను ముద్రించలేదని స్పష్టం చేసింది. ముంబైకి చెందిన మనోరంజన్‌ ఎస్‌.రాయ్‌ అనే వ్యక్తి కొత్త నాణేల ముద్రణపై స్పష్టత ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా.. ఐజీఎమ్‌ ఈ మేరకు వెల్లడించింది.

‘గత కొద్ది రోజులుగా నాణేల మీద వార్తలు వస్తున్నాయి. ఇందులో రూ.10 నుంచి రూ.2,000 వరకు విలువైన కాయిన్స్‌ ఫొటోలు కూడా ఉన్నాయి. ఇది వాస్తవమేనా? దీనిపై స్పష్టత ఇవ్వండి’అని మనోరంజన్‌ దరఖాస్తులో కోరారు. స్పందించిన ఐజీఎమ్‌ కొత్త నాణేల ముద్రణపై వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పింది. ప్రస్తుతం రూ.10 నాణేలను మాత్రమే ముద్రిస్తున్నామని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు