శానిటైజర్‌ను ఆల్కహాల్‌ అనుకుని తాగి..

27 Mar, 2020 15:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువ‌నంత‌పురం : ఆల్క‌హాల్ అనుకుని శానిటైజ‌ర్ తాగిన ఓ ఖైదీ శుక్ర‌వారం మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని పాల‌క్కాడ్‌లో చోటుచేసుకుంది. రామ‌న్ కుట్టి అనే వ్య‌క్తి ఫిబ్ర‌వ‌రి 18 నుంచి రిమాండ్ ఖైదీగా జైలులో శిక్ష అనుభ‌విస్తున్నాడు. ఈ క్ర‌మంలో గురువారం రామ‌న్ కుట్టి క‌ళ్లు తిరిగి ప‌డిపోవ‌డంతో జైలు అధికారులు అత‌నిని ఆసుప‌త్రిలో చేర్పించారు. దీంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు జైలులో ఖైదీల చేత‌ శానిటైజ‌ర్ తయారు చేయిస్తారు.  ఈ నేప‌థ్యంలో గ‌త గురువారం రామ‌న్ కుట్టి ఆల్క‌హాల్ అనుకొని శానిటైజ‌ర్ తాగుంటాడని జైలు అధికారులు భావిస్తున్నారు. అయితే మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు అత‌ని ఆరోగ్యం సాధార‌ణ స్థితిలోనే ఉంద‌ని, బుధ‌వారం రోల్ కాల్ కోసం కూడా హాజ‌ర‌య్యాడ‌ని పేర్కొన్నారు.

కానీ గురువారం ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో క‌ళ్లు తిరిగి ప‌డిపోవ‌డంతో వెంట‌నే అత‌న్ని ఆసుప‌త్రిలో చేర్పించిన‌ట్లు తెలిపారు. శుక్ర‌వారం చికిత్స పొందుతూ మృతి చెంద‌డానికి వెల్ల‌డించారు. కాగా, ఈ విష‌యంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించిన త‌రువాతే ఖైదీ మ‌ర‌ణానికి గల కార‌ణాలు వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా.. జైలు అధికారులు హ్యాండ్ శానిటైజ‌ర్ త‌యారీలో ఐసోప్రొఫైల్ ఆల్క‌హాల్‌ను ప్ర‌ధాన ప‌దార్థంగా ఉప‌యోగిస్తారు. ఈ ప‌దార్థమే ఖైదీ చావుకు కార‌ణమై ఉంటుంద‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 

చదవండి : లాక్‌డౌన్‌ : రోడ్డుపై అనుకోని అతిథి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా