ప్రియదర్శిని హత్య; లా పరీక్షలు రాసేందుకు..

14 May, 2019 16:34 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియదర్శిని మట్టూ హత్య కేసులో దోషి సంతోష్‌ కుమార్‌ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు మూడు వారాల పాటు పెరోల్‌ మంజూరు చేసింది. లా పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం అతడు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం మన్నించింది. ఈ క్రమంలో మే 24 పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో.. మే 21న జైలు నుంచి అతడిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.

కాగా ఢిల్లీ యూనివర్సిటీ లా విద్యార్థిని ప్రియదర్శిని మట్టూ(25) 1996 జనవరిలో హత్యకు గురయ్యారు.  మాజీ ఐపీఎస్‌ కుమారుడైన సంతోష్‌ కుమార్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. దారుణంగా హతమార్చాడు. ఈ నేపథ్యంలో 2006లో సంతోష్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం అతడికి ఉరిశిక్ష విధించింది. దీంతో 2010లో సంతోష్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఉరిశిక్షను.. యావజ్జీవ శిక్షగా మారుస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తలు