ప్రియాంక ఒక్కో పోస్టుకు భారీ మొత్తం!

24 Jul, 2019 19:35 IST|Sakshi

ముంబై : గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ధనికుల జాబితా 2019లో చోటు దక్కించుకున్నారు. హప్పర్‌.కామ్‌ ప్రచురించిన ఈ జాబితాలో భారత్‌ నుంచి ఈ ఇద్దరు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఫోటో షేరింగ్‌ యాప్‌ ప్రొఫైల్‌ ద్వారా షేర్‌ చేసిన ప్రతి ప్రచార పోస్ట్‌కు వసూలు చేసే మొత్తం ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో 43.3 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ కలిగి ఉన్న పిగ్గీచాప్స్‌.. తన ఖాతాలోని ప్రతి ప్రమోషనల్ పోస్ట్‌కు 1.86 కోట్ల పాయలు(2లక్షల డెభై ఒక్క వేల డాలర్లు) ఆర్జిస్తూ ఈ జాబితాలో 19 వ స్థానంలో నిలిచారు. ప్రియాంక చర్మ సంరక్షణ, స్టేషనరీ, ఇతర వస్తువులతో సహా పలు రకాల ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్న విషయం తెలిసిందే.

If you know me, you know there are two things I absolutely love - hand written notes (giving and receiving them), and collecting books...I suppose writing them now, too. Reading and writing have always played an important role in my life...they directly link me to being a creative person, and that’s why partnering with @PilotPenUSA made sense. Through their annual G2 Overachievers Grant and G2 Overachievers Student Grant, Pilot gives out over $100,000 to exceptional individuals who go above and beyond their everyday lives and responsibilities to give back to their communities, and improve the lives of others. I’m honored to be helping select the recipients for 2019, so whether it’s you or someone you know, send me your hand written submission by visiting G2Overachievers.com for full details 💙 #PowerToThePen #DoYouG2

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

అలాగే విరాట్‌ ప్రఖ్యాత స్పోర్ట్స్‌ వేర్‌ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ ప్రతి వాణిజ్య ప్రకటనకు 1.32 కోట్ల రూపాయలు(196 వేల డాలర్లు) సంపాదిస్తూ.. 23వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అమెరికాకు చెందిన కైలీ జెన్నర్  141 మిలియన్ల ఫాలోవర్లతో, ప్రతి ప్రమోషనల్ పోస్ట్‌కు రూ .8.7 కోట్లు (1,266 వేల డాలర్ల)పోందుతూ మొదటి స్థానంలో ఉంది. ఆమె తరువాత అరియానా గ్రాండే, క్రిస్టియానో ​​రొనాల్డో, కిమ్ కర్దాషియాన్, సెలెనా గోమెజ్ మరియు డ్వేన్ జాన్సన్ సహాలు ఉన్నారు.

Loved the gold & white combination on the pitch? @pumaindia has another cricket shoe for you inspired by my one8 Gold Spike Collector’s Edition. 💥 It’s definitely got my 👍. #one8 #CWC19

A post shared by Virat Kohli (@virat.kohli) on

మరిన్ని వార్తలు