ప్రభుత్వ నివాసం ఖాళీ చేయాలని లేఖ

1 Jul, 2020 19:04 IST|Sakshi

ఆగస్ట్‌ 1లోగా ఖాళీ చేయాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీకి కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాను ఆగస్ట్‌ 1లోగా ఖాళీ చేయాలని ఆమెను కోరింది. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేయాలని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆమెకు రాసిన లేఖలో పేర్కొంది.

35, లోడీ ఎస్టేట్స్‌ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆగస్ట్‌ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. ప్రియాంక గాంధీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్‌పీజీ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే.

చదవండి : నేను ఇందిరా గాంధీ మనువరాలిని..

మరిన్ని వార్తలు