దీపావళి తర్వాత కూల్చేస్తాం

30 Oct, 2015 19:19 IST|Sakshi
దీపావళి తర్వాత కూల్చేస్తాం

ముంబయి: దీపావళి పండుగ తర్వాత తమ రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన ఆలయాలను పడగొడతామని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. తొమ్మిది నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వివరణ ఇచ్చింది. 2009 సెప్టెంబర్ 29 తర్వాత రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన కట్టడాలను (ఆలయాలు, మసీదులు, చర్చిలు మరింకేమైనా) తొలగించాలని హైకోర్టు గతవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తొమ్మిది నెలల్లో ఈ వ్యవహారం పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తరుపు అడ్వకేట్ జనరల్ శుక్రవారం కోర్టుకు హాజరై దీపావళి తర్వాత ఆ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఏడాది గడువు కోరినా ఇప్పటికే ఆలస్యం అయిందని కోర్టు అనుమతించలేదు. మహారాష్ట్రలో అక్రమంగా ఇప్పటి వరకు 6336 అక్రమంగా ఆలయాలు నిర్మించారని సమాచారం ఉంది. వీటిలో 207 రెగ్యులరైజ్ కాగా, 179 కట్టడాలను ఇటీవల నేలమట్టం చేశారు.

 

మరిన్ని వార్తలు