మహిళలకు రక్షణ కరువు

5 Jun, 2014 23:05 IST|Sakshi

 సాక్షి, ముంబై: మహిళల అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీ డీఎఫ్ కూటమి ప్రభుత్వం లో మహిళలకు రక్షణ కరువైంది. అత్యాచారాలు పెరిగిపోయాయి. లైంగిక వేధింపులు అధికమయ్యా యి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో దేశంలోనే రాష్ట్రం ఐదో స్థానం ఉంది. ఆడ పిల్లలపై జరుగుతున్న వివిధ నేరాల్లో నాలుగో స్థానంలో ఉంది. తాజాగా వెలువడిన సర్వేలో ఈ వివరాలు తేలా యి. దీంతో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
మహిళలకు భద్రత కల్పించేం దుకు 1994లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందించింది. ఇలాంటి విధానాన్ని రూపొందించడం దేశంలో మహారాష్ట్ర మొట్టమొదటి రాష్ట్రమని ప్రభుత్వం గొప్పలు చెప్పకుంటది. 2013లో మళ్లీ కొత్త విధానాన్ని రూపొందించామని డీఎఫ్ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అందులో మహిళల సంక్షేమానికి వివిధ పథకాలు ప్రవేశపెట్టామని పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేసింది. కానీ వీరి పాలనలో మహిళలకు భద్రత  కరువైంది. వా రిపై అత్యాచారాలు పెరిగిపోయాని తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య మరిం త పెరిగి ఆందోళన కలిగిస్తోంది. వార్షిక నివే దిక రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది 17,800 మహిళలపై, 3,456 మంది బాలికలపై అత్యాచారాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి.
 
 నేరాలను అరికట్టేందుకు ఏటా కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ అదుపులోకి రావడం లే దు. పెరుగుతున్న నేరాల సంఖ్య పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. బాలికలపై ఉత్తరప్రదేశలో 6,033, మధ్యప్రదేశ్‌లో 5,168, ఢిల్లీలో 4,462 అ త్యాచారం కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఉంది. అదేవిధంగా 2010తో పోలిస్తే 2012లో మహిళలపై వివిధ నేరా లు పెరిగిపోయాయి. అందులో అత్యాచారాలు 1,839, అపహరణ కేసులు 1,140, అదనపు కట్న దాహానికి బలైన కేసులు 7,415, లైంగిక వేధింపుల కేసులు 3,935, ఈవ్‌టీజింగ్ కేసులు 1,294   నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు