కరోనాను లెక్కచేయకుండా నిరసనలు

18 Mar, 2020 15:00 IST|Sakshi
భారీ సంఖ్యలో గుమిగూడిన నిరసనకారులు

చెన్నై : నగరంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మరోసారి నిరసనలు వ్యక్తమయ్యాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మద్రాస్‌ హైకోర్టు వద్దకు చేరుకున్న తౌహీద్‌ జమత్‌ సభ్యులు, మరికొంతమంది సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా బుధవారం మధ్యాహ్నం నిరసన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిసినా సీఏఏ వ్యతిరేక ఆందోళనలో జనం కదం తొక్కారు. కాగా, దేశంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారీ సభలు, నిరసనలను ప్రభుత్వాలు ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికి నిరసన కోసం పెద్దసంఖ్యలో జనం ఒక్కచోట చేరటం చర్చనీయాంశంగా మారింది. 

చదవండి : పౌరసత్వ నిరూపణకు మతం ఆధారమా?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా