ఖలిస్తాన్ నినాదాలతో మార్మోగిన ఆలయం

6 Jun, 2015 18:00 IST|Sakshi
ఖలిస్తాన్ నినాదాలతో మార్మోగిన ఆలయం

ఆపరేషన్‌ బ్లూస్టార్‌ 31వ వార్షికోత్సవం సందర్భంగా అమృత్‌సర్‌లో జరిగిన నివాళి కార్యక్రమంలో రెండు సిక్కు గ్రూపుల మధ్య జరిగిన దాడులు శనివారం ఉద్రిక్త వాతావరణానికి దారి తీశాయి. ఈ ఘర్షణలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. నివాళి అర్పిస్తున్న సమయంలోనే స్వర్ణదేవాలయంలో ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు మార్మోగాయి. దీంతో ప్రత్యేక ఖలిస్తాన్ని సమర్థించే, వ్యతిరేకించే రెండు సిక్కు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్వర్ణ దేవాలయం శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ)కి చెందిన సిబ్బంది , రాడికల్ గ్రూపులకు మధ్య ఘర్షణ జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.

1984 జూన్ నెలలోజరిగిన ఆపరేషన్ బ్లూస్టార్పై ఐక్యరాజ్యసమితితో విచారణ జరిపించాలని ఎన్నో ఏళ్లుగా రాడికల్ గ్రూపు డిమాండ్ చేస్తోంది. అకాలీదళ్‌ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గత ఏడాది కూడా ఘర్షణ జరిగింది. నాటి ఘర్షణల్లో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు