పబ్జి ప్రియులకు శుభవార్త

28 May, 2020 15:05 IST|Sakshi

ఈ కరోనా మహమ్మరి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే వీరిలో ముఖ్యంగా యువతను ఇళ్లు కదలకుండా ఉంచుతుంది మాత్రం ఆన్‌లైన్‌ గేమ్స్. వాటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది పబ్జీ గేమ్‌ గురించి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ కొత్త మోడ్స్‌ గేమ్‌కి అతుక్కుపోయేలా చేస్తోంది పబ్జీ. గతంలో 0.17.0 అప్‌డేట్‌ వచ్చింది. ఇప్పుడు అది కాకుండా మరో అప్‌డేట్‌తో పబ్జి మన ముందుకు రాబోతుంది. అయితే ఈ అప్‌డేట్‌ కోసం పబ్జి ప్రియులు ఎక్కువ కాలం వేచివుండాల్సిన పనిలేదు. జూన్‌ 1వ తేదీన ఈ అప్‌డేట్‌ రానుంది.ఇది కొత్త గేమ్‌ ఐటమ్స్‌తో పాటు మరో  గేమ్‌ మోడ్‌ని పబ్జి ప్రియులకు అందించనుంది. ఈ అప్‌డేట్‌ షానాంక్‌ మ్యాప్‌ ఆధారితమైన జంగిల్‌ మోడ్‌ను తీసుకురానుంది. (కోహ్లి.. అనుష్కకు విడాకులు ఇచ్చేయ్)

అయితే ఈ జంగిల్‌మోడ్‌లో ఏముంటి? ఈ విషయం మాత్రం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఈ మోడ్‌లో ఏం అందుబాటులోకి వస్తుంది అనే విషయాన్ని పబ్జి టీం ఇంతవరకు బయట పెట్టలేదు. అయితే
పబ్జిటీమ్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేసిన టీజర్‌ ఆధారంగా చూస్తే ఇది ఒక ట్రజర్‌ హంట్‌ లాగా కనిపిస్తోంది. దీనిలో ప్లేయర్‌ మరో ఇద్దరితో టీంగా ఏర్పడి ఇచ్చే క్లూస్‌ ఆధారంగా నిధిని కనిపెట్టాల్సి ఉంటుందని
టీజర్‌ బట్టి  అర్ధం  అవుతుంది. ఈ ట్రజర్‌ హంట్‌లో శత్రవులను అంతం చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ మోడ్‌ షానాంక్‌ ఆధారంగా పనిచేస్తోంది కాబట్టి ఈ గేమ్‌లో గెలవాలంటే జంగిల్‌ గేమ్‌ యుద్ద
మెలుకువలన్ని తెలిసివుండటం అవసరం. ఇంతక ముందు గేమ్‌లో పోటీని పెంచడానికి పబ్జీ టీం బ్లూ జోన్‌ మోడ్‌ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ జంగీల్‌ మోడ్‌తో పబ్జి గేమ్‌ మరింత ఆసక్తిగా మారనుందని అంతా భావిస్తున్నారు.  (వైరస్ భయం: ఫ్లైట్లో నలుగురు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు