ఆన్‌లైన్ క్లాసుల‌ని ఫోన్ ఇస్తే ఏకంగా..

3 Jul, 2020 21:49 IST|Sakshi

ఛండీగ‌ర్ : ఆన్‌లైన్ క్లాసుల‌ని మొబైల్ ఫోన్ ఇస్తే కేవ‌లం నెల రోజుల్లోనే 16 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను స్వాహా చేశాడు ఓ టీనేజీ యువ‌కుడు.  ప‌బ్‌జీ గేమ్ ఆడుతూ వివిధ టోర్న‌మెంట్లు, పాస్‌లు, స‌హా వివిధ మందుగుండు సామాగ్రిని కొన‌డానికి ఆ డ‌బ్బాంతా ఖ‌ర్చుపెట్టాడు. అయితే పోనీ పాపం అని వ‌దిలేయ‌కుండా డ‌బ్బు విలువ తెలిసేలా అత‌డ్ని ఓ స్కూట‌ర్ రీపెయిర్ దుకాణంలో ప‌నికి పెట్టాడు అత‌ని  తండ్రి. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఖాగ‌ర్ న‌గ‌రానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్ క్లాసుల కోసం త‌ల్లిదండ్రుల మొబైల్ ఫోన్ల‌ను వాడేవాడు. అయితే పేరేంట్స్ బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు  త‌దిత‌ర వివ‌రాల‌న్నీ మొబైల్ ఫోన్లేనే సేవ్ చేసి ఉండ‌టంతో ఇదే అద‌నుగా భావించాడు. చ‌దువు పేరిట ఎక్కువ స‌మ‌యం ఫోన్‌లోనే గ‌డుపుతూ ప‌బ్‌జీ గేమ్‌లో వివిధ టోర్న‌మెంట్‌ల కోసం డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాడు. ఈ లావాదేవీల‌కు సంబంధించి మెసేజ్‌లు రాగానే వెంట‌నే డిలీట్ చేసేవాడు. దీంతో త‌ల్లిదండ్రుల‌కు కూడా ఏమాత్రం అనుమానం రాలేదు. ఇంకా తెలివిగా త‌ల్లి ఖాతా నుంచి తండ్రికి, అత‌ని నుంచి త‌ల్లి ఖాతాల‌కు అనేక సంద‌ర్భాల్లో లావాదేవిలు జ‌రిపాడు. దీంతో వారిద్ద‌రి అకౌంట్‌లోంచి మొత్తం డ‌బ్బులు స్వాహా చేశాడు. చివ‌రికి త‌ల్లి ప్రావిడెంట్ ఫండ్ డ‌బ్బు మెత్తాన్ని ఖ‌ర్చుపెట్టాడు. (పంజాబ్‌ సీఎం కీలక నిర్ణయం )

కొన్ని రోజుల‌కి బ్యాంకు వెళ్లిన త‌ల్లిదండ్రుల‌కి వాళ్ల అకౌంట్‌లోంచి 16 ల‌క్ష‌లు డ్రా చేశార‌ని చెప్ప‌డంతో ఖంగుతిన్నారు. మొద‌ట సైబ‌ర్ నేర‌గాళ్ల ప‌నేమో అని ఖంగారు ప‌డి పోలీస్‌స్టేష‌న్‌కి వెళ్లారు. తీరా విచార‌ణ‌లో 17 ఏళ్ల కొడుకే ఇంటి దొంగ అని తేల‌డంతో ఒక్క‌సారిగా షాక్ అయ్యారు.  ఎన్నో నెల‌లుగా క‌ష్ట‌ప‌డి ఒక్కో రూపాయి కూడ‌గ‌ట్టుకొని వైద్యం, కొడుకు చ‌దువు కోసం దాచిపె్ట్టిన డ‌బ్బంతా ఒక్క‌సారిగా ఆవిర‌య్యింది. దీంతో కొడుక్కి డ‌బ్బు విలువ తెలియ‌జేసేలా అత‌న్ని ఓ స్కూట‌ర్ రిపేయ‌ర్ దుకాణంలో ప‌నికి పెట్టాడు. త‌ద్వారా డబ్బు సంపాదించ‌డం ఎంత క‌ష్ట‌మో తెలుస్తుంది అని తండ్రి పేర్కొన్నారు . అన్ని గేమ్స్ కంటే మే, జూన్ నెల‌లో ప‌బ్జీ అత్య‌ధిక లాభాలను అర్జించిన‌ట్లు సెన్సార్ టవర్ వెల్ల‌డించింది. అంతేకాకుండా ప‌బ్జీకి అల‌వాడుప‌డి ప‌లువురు టీనేజ‌ర్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉదంతాలు కూడా అనేకం. పిల్ల‌ల శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం చూపిస్తుంద‌ని ఇటీవ‌లె పాకిస్తాన్ ప‌బ్జీ ఆట‌ను నిషేదించింది. 
(వలస కార్మికులను ముందుగానే పంపి ఉంటే.. )

>
మరిన్ని వార్తలు