యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

25 Apr, 2020 14:07 IST|Sakshi

లక్నో : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ కట్టడికి అన్ని రాష్టాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తూనే వైరస్‌ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు రాష్ట్రంలో సభలు, సమావేశాలపై నిషేధం విధించింది. పెద్ద సంఖ్యలో జనం ఎక్కడా ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో తదుపరి పరిస్థితిని బట్టి నిషేధంపై చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, బాధితులకు అందుతున్న వైద్య సహాయాలపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగానే అధికారులు, వైద్య సిబ్బంది సూచనల మేరకు జూన్‌ 30 వరకు సభలూ, సమావేశాలపై నిషేధం విధించారు. కాగా దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఆంక్షల నుంచి సడలింపులు ఇస్తున్న తరుణంలోనే యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు