ఐదో రోజుకు నారాయణస్వామి ధర్నా

18 Feb, 2019 05:43 IST|Sakshi

లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో 21న చర్చ

పుదుచ్చేరి: లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి వైఖరికి నిరసనగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి రాజ్‌నివాస్‌ బయట చేస్తున్న ధర్నా ఆదివారం ఐదోరోజుకు చేరింది. సం క్షేమ పథకాలపై ప్రభుత్వ ప్రతిపాదనలకు బేడి ఆమోదం తెలపకుంటే నిరసనను తీవ్రతరం చేసి జైల్‌భరో ఆందోళనకు దిగుతామని  హెచ్చరించారు. ఉచిత బియ్య పంపిణీ పథకంతోపాటు మరో 39 సంక్షేమ పథకాల ప్రతిపాదనలు, పరిపాలనా సంబంధ నిర్ణయాల్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

బేడికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నాయకులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగరవేశారు. తమ నిరసన తెలిపేందుకు నల్ల జెండాలు ఎగరవేసే స్థాయికి చేరడం దురదృష్టకరమని నారాయణస్వామి పేర్కొన్నారు. విభేదాలపై ఫిబ్రవరి 21న బహిరంగ చర్చకు వస్తానని బేడి చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నానని చెప్పారు.  డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ పుదుచ్చేరి వెళ్లి నారాయణస్వామి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. సంక్షేమ పథకాల అమలుకు అడ్డుపడుతున్న కిరణ్‌ బేడిని కేంద్రం వెనక్కి పిలవాల ని డిమాండ్‌ చేశారు.  బేడి ప్రజాస్వామిక విలు వల్ని అణగదొక్కుతున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు