కరోనా ఎఫెక్ట్‌.. బార్లు బంద్‌

18 Mar, 2020 21:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంపై విరుచుకుపడుతోన్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19) అరికట్టడానికి అన్ని దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మహమ్మారి వైరస్‌ వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. సభలు, సమావేశాలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచనలు జారీచేసింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు విద్యాసంస్థలు, షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లు మూసేశాయి. రద్దీగా ఉండే ప్రాంతలలో జనసమూహం లేకుండా చూసుకుంటున్నారు.

అన్ని రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది. మార్చి 19 నుంచి మద్యం బార్లు మూసివేయనున్నట్లు పుదుచ్చేరి సీఎం వీ నారాయణ స్వామి వెల్లడించారు. పర్యాటక ప్రదేశాలు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు బుధవారం నుంచి ఈ నెలాఖరు వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో ఇప్పటివరకు 151 మందికి సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు