సూర్యుడు ఓం అంటున్నాడు!

5 Jan, 2020 03:15 IST|Sakshi

వీడియో పోస్ట్‌ చేసిన కిరణ్‌ బేడీ

న్యూఢిల్లీ: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్న వీడియోలు నకిలీవా?, ఒరిజినల్‌వా అని తేల్చుకోలేని పరిస్థితి ఉంది. కొందరు సెలబ్రిటీలు సైతం తమ ట్విట్టర్‌ ఖాతాల్లో నకిలీ వీడియోలను పోస్ట్‌ చేసి నెటిజన్ల ట్రోల్స్‌ బారిన పడిన వారు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ. ఇంతకీ విషయమేమిటంటే.. ‘సూర్యుడు ఓం అని పలుకుతున్నాడు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దాన్ని రికార్డు చేసింది’ అని ఆమె ఒక వీడియోను ట్విట్టర్‌ ఖాతా ద్వారా శనివారం పోస్ట్‌ చేశారు.

ఇంకేముంది ఆ ట్వీట్‌ను 7వేల మందికి పైగా రీట్వీట్‌ చేయడంతో పాటు వందల మంది దానిపై స్పందించారు. అయితే వాస్తవానికి ఇదో నకిలీ వీడియో. ఇది భారత వాట్సాప్‌ గ్రూపుల్లో చాలాకాలాంగా సర్క్యులేట్‌ అవుతోంది. అందులో ఎలాంటి ఓం వినిపించదు. దీంతో పలువురు నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తూ ‘‘సూర్యుడు.. ‘వాహ్‌ మోదీజీ.. వాహ్‌’ అని అనడం కూడా ప్రారంభిస్తాడు’’ అంటూ కిరణ్‌ బేడీపై వ్యంగ్య వ్యాఖ్యలు కనిపించాయి. అసలు సంగతి ఏంటంటే ‘సూర్యుడు నిశ్శబ్దంగా ఉండడు. సూర్యుడి గుండెచప్పుడు వినడం ద్వారా శాస్త్రవేత్తలు దానిలోని సౌర పదార్థాల ప్రవాహాలను, తరంగాలను, అలజడులను మరింత విస్తృతంగా శోధిస్తున్నారు. దీంతో గతంలో తెలియని అనేక సౌర రహస్యాలను తెలుసుకునేందుకూ వీలు ఏర్పడింది’ అని 2018లో నాసా ఒక ట్వీట్‌ చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాక్‌లో గురుద్వారాపై దాడి.. పలువురి ఖండన

ఈగోతో ‘హర్ట్‌’ అయితే.. హార్ట్‌కు ముప్పు!

వావ్‌.. టైట్రాన్‌ రోవ్‌

కాక్‌పిట్‌ తలుపులు పగలగొడతా

వీకెండ్‌ ఫోకస్‌.. వార్తల్లో వ్యక్తులు

ఇప్పుడు కూడా ఆయనను కౌగిలించుకుంటారా?

సదాఫ్‌ జాఫర్‌కు బెయిల్‌

ఈనాటి ముఖ్యాంశాలు

పొట్టలో గుడ్డముక్క.. ప్రాణాలు విడిచిన మహిళ

ఆర్మీ పప్పెట్‌ బిజీగా ఉన్నాడు: గంభీర్‌

హాట్సాఫ్‌; రూ.300 కోట్ల భవనం దానం

సచిన్‌ పైలట్‌ సంచలన వ్యాఖ్యలు!

'సీఏఏ దేశాన్ని ఏకాకిని చేయబోతోంది'

మేడం.. ఇవేనా మీరు ప్రచారం చేసేది..!

అందుకే వాళ్లంతా మరణించారు!

ఆనాటి నుంచే సీఏఏ కశ్మీర్‌లో అమల్లోకి..

సీఆర్పీఎఫ్‌ జవాన్లపై గ్రెనేడ్లతో ఉగ్రదాడి

‘టిక్‌టాక్‌’పై భారత్‌ నిఘానే ఎక్కువ!

శివసేనకు భారీ షాక్‌.. మంత్రి రాజీనామా!

డ్రామాలు చేయకండి.. బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్‌

వైరల్‌ : చీరలు కట్టుకుని కాలేజీకి అబ్బాయిలు

పౌర రగడ: పోలీసులకు బుల్లెట్‌ గాయాలు

సీఎం ముందే స్పీకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇరాన్‌ గగనతలం మీదుగా విమానాలు వెళ్లనివ్వద్దు

దుమారం రేపుతున్న పోస్టర్‌ వార్‌

చేప గాలానికి.. 22 అడుగుల ‘తిమింగలం’

రాజీవ్‌ హత్య: గవర్నర్‌నే సాగనంపే యత్నం

కుప్పకూలిన విమానం, విషాదం  

చిదంబరంను ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

అలహాబాద్‌ వర్సిటీ వీసీ రాజీనామాకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేనింకా ఆ స్థాయికి వెళ్లలేదు

సమస్యలను పరిష్కరించడమే గిల్డ్‌ టార్గెట్‌

ప్రేక్షకుల హృదయాల్ని కబ్జా చేస్తాం

బోల్డ్‌ హరి

ఇలాంటి ఛాన్స్‌ ఊరికే రాదు

హీరో చీమ