కశ్మీర్‌ ఫొటో జర్నలిస్టులకు పులిట్జర్‌ అవార్డు

6 May, 2020 02:26 IST|Sakshi
శ్రీనగర్‌లో భద్రతాదళ వాహనంపై దాడిచేస్తున్న వేర్పాటువాది(ఫైల్‌). ఫీచర్‌ ఫొటోగ్రఫీ కేటగిరీ కింద అవార్డు పొందిన వాటిల్లో ఇదీ ఉంది.

శ్రీనగర్‌: ఈ యేడాది ప్రతిష్టాత్మక పులిట్జర్‌ అవార్డు జమ్మూకశ్మీర్‌కు చెందిన ఫొటో జర్నలిస్టులను వరించింది. అసోసియేట్‌ ప్రెస్‌కి చెందిన చెన్నీ ఆనంద్, ముక్తార్‌ ఖాన్, దార్‌ యాసీన్‌లను ఫీచర్‌ ఫొటోగ్రఫీ కేటగిరీ కింద ఈ అవార్డులకు ఎంపిక చేశారు. 370 రద్దు సందర్భంలో, కశ్మీర్‌లో లాక్‌డౌన్‌ కాలంలో ప్రజల కష్టాలను తమ కెమెరాల్లో బంధించినందుకుగాను వీరికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ‘ఇది తమకు దక్కిన అరుదైన గౌరవం’ అనీ, క్లిష్టకాలంలో తమకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, అసోసియేటెడ్‌ ప్రెస్‌లకు  అవార్డుని గెలుచుకున్న జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. పరిశోధనాత్మక రిపోర్టింగ్, ఇంటర్నేషనల్‌ రిపోర్టింగ్‌లో ది న్యూయార్క్‌ టైమ్స్‌కి రెండు ప్రైజ్‌లు దక్కాయి.

మరిన్ని వార్తలు