పుల్వామా ఉగ్రదాడి‌; మాస్టర్‌ మైండ్‌ హతం!

18 Feb, 2019 11:27 IST|Sakshi

శ్రీనగర్‌ : పుల్వామాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భాగంగా పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. అతడితో పాటు మరో జైషే ఉగ్రవాదిని కమ్రాన్‌ను కూడా భారత బలగాలు హతమార్చాయి. సోమవారం నాడు తమపై అటాక్‌ చేసిన ఆ ఇద్దరితో పాటు మరొక ఉగ్రవాదిని సైన్యం కాల్చి చంపినట్లు తెలుస్తోంది. తద్వారా సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే వీరిద్దరిని హతమార్చి దీటైన సమాధానం ఇచ్చింది.(ఉగ్రవాది ఆదిల్‌కు శిక్షణ ఇచ్చింది అతడే!)

కాగా 43 మంది జవాన్ల మరణాన్ని మరవక ముందే జైషే ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పుల్వామాలోని పింగ్లన్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మేజర్‌ సహా ముగ్గురు భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ జవాన్లు 55 రాష్ట్రీయ రైఫిల్స్‌ దళానికి చెందిన వారు.(పుల్వామాలో ఎన్‌కౌంటర్‌; మేజర్‌ సహా ముగ్గురు జవాన్ల మృతి)

చదవండి : రివేంజ్‌ తీర్చుకునేందుకు టైమ్‌, ప్లేస్‌ డిసైడ్ చేయండి..

ఉగ్ర మారణహోమం

పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం

మరిన్ని వార్తలు