ఇల్లు ఊడ్వటానికి రూ. 800, రొట్టెలకు వెయ్యి!

8 Nov, 2019 13:32 IST|Sakshi

ఈ పోటీ ప్రపంచంలో ఒక్కసారి ఉద్యోగం కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం ఎంత కష్టమో మనలో చాలా మందికి అనుభవమే. ఇక నాలుగు ఇళ్లల్లో పనిచేసుకుని జీవనం సాగించే హోం మేడ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యజమానుల దయాగుణంపైనే వారి ఆదాయం, ‘ఉద్యోగం’ ఆధారపడి ఉంటుంది. కొంతమంది యజమానులు కఠిన వైఖరి ప్రదర్శిస్తూ అతి తక్కువ జీతానికే వారి సేవలు వినియోగించుకోవాలని చూస్తుంటారు. అంతేకాదు పొరపాటున జీతం పెంచమని అడిగితే పనిలో నుంచి తీసివేస్తామని బెదిరిస్తారు. దీంతో అప్పటికప్పుడు వేరే చోట పని దొరక్క.. ఉపాధి దొరికే అవకాశం లేక వాళ్లు విలవిల్లాడతారు. అయితే పూణేకు చెందిన ధనశ్రీ షిండే అనే బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ మాత్రం తన ఇంట్లో పనిచేసే మహిళకు ఇలాంటి పరిస్థితి రానివ్వలేదు. మార్కెటింగ్‌ రంగంలో తనకున్న అనుభవాన్ని ఉపయోగించి ఆమెకు ఓ బిజినెస్‌ కార్డు తయారు చేసి.. ఆమెకు చేతినిండా పనిదొరికేలా చేశారు.

ఈ విషయాన్ని అస్మితా జవదేవకర్‌ అనే నెటిజన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘ ధనశ్రీ ఓ రోజు ఇంటికి వచ్చే సమయానికి ఆమె పనిమనిషి గీతా కాలే బాధగా కనిపించింది. ఏమైందని ఆరా తీయగా తన ఉద్యోగం పోయిందని చెప్పింది. తద్వారా తాను నెలకు 4000 రూపాయల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందింది. అప్పుడు ధనశ్రీకి ఓ ఆలోచన తట్టింది. ‘ అంట్లు తోమడానికి నెలకు రూ. 800, ఇల్లు ఊడ్వటానికి రూ. 800, బట్టలు ఉతకడానికి రూ. 800, రొట్టెలు చేసేందుకు 1000 రూపాయలు. ఇక ఇల్లు శుభ్రం చేయడం, కూరగాయలు తరగడం వంటి సేవలు అదనం. ఆధార్‌ కార్డు కూడా వెరిఫై చేయబడింది’ అంటూ గీతా కాలే పేరిట ఓ బిజినెస్‌ కార్డు రూపొందించింది. ఇప్పుడు వాళ్లకు పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. గీతా సేవలను వినియోగించుకునేందుకు బద్వాన్‌ వాసులు ముందుకు వస్తున్నారు’ అని తన అస్మిత తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకొచ్చారు. కాగా ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో గీతా, ధనశ్రీలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యజమాని మనసు గెలుచుకున్న గీతా... పనిమనిషి సమస్యను పరిష్కరించిన ధనశ్రీ.. మీరిద్దరూ సూపర్‌. అన్నట్లు మీ బిజినెస్‌ కార్డు కూడా ఎంతో బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం పదవికి ఫడ్నవిస్‌ రాజీనామా

గాంధీ కుటుంబానికి షాకిచ్చిన కేంద్రం!

'ప్రాణాలు కాపాడుతానంటున్న యమరాజు'

‘ఛత్రపతి శివాజీకి అవమానం.. తీవ్ర విమర్శలు’

అయోధ్య తీర్పు : ప్రజలకు రజనీకాంత్‌ విఙ్ఞప్తి

‘పాకిస్తాన్‌కు నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు’

యూపీ అధికారులతో సమావేశం కానున్న సీజేఐ

మహిళా డీసీపీని పరుగెత్తించిన లాయర్లు..!

జేపీఆర్‌ విద్యాసంస్థలపై ఐటీ దాడులు

సెక్యూరిటీ గార్డుల సంక్షేమానికి ముసాయిదా

‘ఇండియా జస్టిస్‌’లో మహారాష్ట్ర టాప్‌

మొక్కల విప్లవానికి..సాంకేతిక రెక్కలు

ఈనెల 17లోగా 6 కీలక తీర్పులు!

మహిళల ముసుగులో పాక్‌ ఏజెంట్లు

సస్పెన్స్‌ సా...గుతోంది!

కోయంబత్తూర్‌ రేప్‌ దోషికి ఉరే సరి

హామీ ఇస్తే ‘ఆర్‌సెప్‌’పై ఆలోచిస్తాం

అయోధ్యలో నిశ్శబ్దం

దారి తప్పిన ‘సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెస్లా’ కారు!

ఈనాటి ముఖ్యాంశాలు

వైరల్‌: నడిరోడ్డుపై ఎద్దు బీభత్సం

అయోధ్య తీర్పు: దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌

ధర్మశాలలో మోదీ.. అభివృద్ధిపై ప్రశంసలు

వీడని ప్రతిష్టంభన: బీజేపీకి సేన సవాల్‌!

మహిళల ప్రాతినిధ్యం అంతంతమాత్రమే..!

ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆర్డర్‌ చేయండి!

‘మాస్క్‌’లు కాలుష్యాన్ని ఆపుతాయా!?

ఎంపీ సంజయ్‌పై దాడి.. స్పీకర్‌ కీలక ఆదేశాలు

ఆ రైల్లో ఇక అర లీటరు బాటిళ్లే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేశ్‌ మేనల్లుడితో ‘ఇస్మార్ట్‌’బ్యూటీ

‘ట్రెండ్‌’సెట్‌ చేస్తున్న నితిన్‌, రష్మికా

అలా చేయనందుకు భారీ మొత్తం: నటి

‘నా నాలుక భాగాన్ని కత్తిరించారు’

హాలీవుడ్‌ నటుడితో పోటీపడుతున్న కఫూర్‌ ఫ్యామిలీ

బన్నీ ట్వీట్‌.. రిలీజ్‌ డేట్‌ మారినట్టేనా?